తాను తీయబోయే సినిమా బాహుబలిని మించి ఉంటుందన్న బాలీవుడ్ విమర్శకుడు
- మరోసారి వార్తల్లోకెక్కిన కమాల్ ఆర్ ఖాన్
- గతంలో దేశ్ ద్రోహి చిత్రం తీసిన వైనం
- ఇప్పుడు దానికి సీక్వెల్ తీస్తానని వెల్లడి
- బ్లాక్ బస్టర్ ఎలా తీయాలో బాలీవుడ్ కు చూపిస్తానని వ్యాఖ్యలు
బ్లాక్ బస్టర్ సినిమా ఎలా తీయాలో దేశ్ ద్రోహి-2 చిత్రం ద్వారా బాలీవుడ్ కు మార్గదర్శనం చేస్తానని పేర్కొన్నాడు. తన కొత్త చిత్రం బాహుబలిని మించి ఉంటుందని చెప్పాడు. త్వరలోనే ఈ సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లనుందని కమాల్ ఆర్ ఖాన్ వెల్లడించాడు. ఈ మేరకు ఓ పోస్టర్ ను కూడా పంచుకున్నాడు.