మరోసారి కట్టిపడేసిన సిద్ శ్రీరామ్!

lambasingi Movie Update
  • మరో ప్రేమకథగా 'లంబసింగి'
  • హీరోయిన్ గా 'బిగ్ బాస్' ఫేమ్ దివి  
  • దర్శకుడిగా నవీన్ గాంధీ పరిచయం
  • సంగీత దర్శకుడిగా ధృవన్   
ఈ మధ్య కాలంలో బాగా పాప్యులర్ అయిన సింగర్ .. సిద్ శ్రీరామ్. ఆయన వాయిస్ .. పాటలు యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాయి. ఆయన పాటలకి అనూహ్యమైన స్థాయిలో వ్యూస్ లభిస్తుండటం విశేషం. దాంతో తమ సినిమాలో ఒక్కటైనా ఆయన పాట ఉండాలని మేకర్స్ భావిస్తున్నారు. దాంతో సిద్ శ్రీరామ్ ఇప్పుడు మరింత బిజీ సింగర్ గా మారిపోయాడు.

'లంబసింగి' సినిమా కోసం ఆయన పాడిన ఒక పాటను ఈ సినిమా టీమ్ కొంతసేపటి క్రితం రిలీజ్ చేసింది. నాగార్జున చేతుల మీదుగా ఈ పాటను రిలీజ్ చేయించారు. 'నచ్చేసిందే .. నచ్చేసిందే  .. నాకెంతో నచ్చిందే ఈ పిల్లా, నవ్వేసిందే .. నవ్వేసిందే నా మనసే తవ్వేసిందే ఇలా' అంటూ ఈ పాట సాగుతోంది.

తనదైన స్టైల్లో సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ పాట యూత్ కి కనెక్ట్ అయ్యేలా ఉంది. ధృవన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాకి కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించాడు. కొత్త హీరో భరత్ రాజ్ .. బిగ్ బాస్ ఫేమ్ దివి జంటగా నవీన్ గాంధీ రూపొందించిన ఈ సినిమాకి, 'బంగార్రాజు' దర్శకుడు కల్యాణ్ రామ్ సమర్పకుడిగా వ్యవహరిస్తూ ఉండటం విశేషం.
Go Back to Shorts
Bharth Raj
Divi
lambasingi Movie

More Telugu News