తెలంగాణలో నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్
- 80 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి సీఎం ప్రకటన
- తొలి విడతలో 30,453 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి
- రెండో విడతలో 3,334 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్
రెండో విడతలో ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వాటిలో ఎక్సైజ్, ఫారెస్ట్, అగ్ని మాపక శాఖలకు చెందిన ఉద్యోగాలు ఉన్నాయి. ఈ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇచ్చిన ఆర్థిక శాఖ.. మిగిలిన శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అనుమతులపై దృష్టి సారించింది. ఆర్థిక శాఖ నుంచి అనుమతి లభించిన ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్లు జారీ కానున్నాయి.