మంత్రులంతా డ‌మ్మీలే.. జ‌గ‌న్ కేబినెట్‌పై నారా లోకేశ్ విమ‌ర్శ‌

nara lokesh comments on ys jagan cabinet
  • భ‌జ‌న చేసిన వారికే జ‌గ‌న్ మంత్రి ప‌ద‌వులు
  • జ‌గ‌న్ సీఎం అయ్యాక అన్నింటి ధ‌ర‌లూ పెరిగాయి
  • వ‌చ్చే నెల‌లో ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్లు ముట్ట‌డిస్తామ‌న్న లోకేశ్
ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కేబినెట్‌పై టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఘాటు విమ‌ర్శ‌లు గుప్పించారు. జ‌గ‌న్ కొత్త కేబినెట్‌లోని మంత్రులంతా డమ్మీలేన‌ని ఆయ‌న విమ‌ర్శించారు. భ‌జ‌న చేసిన వారికే జ‌గ‌న్ మంత్రి ప‌ద‌వులు కేటాయించార‌ని లోకేశ్ వ్యాఖ్యానించారు. ఏపీలో పెరిగిన విద్యుత్ చార్జీల‌కు నిర‌స‌న‌గా బుధ‌వారం మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించిన లోకేశ్.. ప్ర‌జ‌ల‌కు కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు పంపిణీ చేశారు. 

ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ ప్ర‌భుత్వ విధానాల‌పై లోకేశ్ విమ‌ర్శ‌లు చేశారు. జ‌గ‌న్ సీఎం అయ్యాక రాష్ట్రంలో అన్నింటి ధ‌ర‌లు పెంచుకుంటూ పోతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వచ్చే నెల‌లో విద్యుత్ బిల్లులు వ‌చ్చాక టీడీపీ ఆధ్వ‌ర్యంలో ఎమ్మెల్యేలు,. మంత్రుల ఇళ్ల‌ను ముట్ట‌డిస్తామ‌ని లోకేశ్ తెలిపారు.
Go Back to Shorts
TDP
Nara Lokesh
AP Cabinet
Mangalagiri

More Telugu News