ఇక వరుసగా మూడు నెలలు పెళ్లిళ్లే పెళ్లిళ్లు.. శుభ ముహూర్త తేదీలివే..!
- ఇవాళ్టి నుంచే ముహూర్తాలు షురూ
- ఇన్నాళ్లూ కరోనాతో వివాహాలకు ఆటంకాలు
- ఆంక్షలు ఎత్తేయడంతో ఆడంబరంగా చేసుకునేందుకు అవకాశం
ఇక, ఇప్పుడూ పెళ్లి ముహూర్తాలు వచ్చేశాయి. వరుసగా మూడు నెలల పాటు మంచి ముహూర్తాలున్నాయి. ఈ నెల, వచ్చే నెల, జూన్ లలో చాలా రోజుల పాటు శుభముహూర్తాలున్నాయి. దీంతో ఈ మూడు నెలలూ పెళ్లిళ్లతో మండపాలు కళకళలాడనున్నాయి. డీజే సౌండ్లు, బరాత్ లతో వీధులు హోరెత్తనున్నాయి.
ఇక, ఇప్పటికే కల్యాణ మండపాలకు అడ్వాన్సులు కూడా ఇచ్చేస్తున్నారు. పెళ్లి కార్డులు, పెళ్లి బట్టల షాపింగ్ చేస్తున్నారు. దీంతో ఫొటోగ్రాఫర్లు, ట్రావెల్స్, పెళ్లిమండపాలు, పురోహితులు, బ్యాండ్ మేళం వాళ్లకు ఉపాధి దొరుకుతోంది.
ఇవీ ముహూర్తపు తేదీలు..
ఏప్రిల్: 13, 14, 15, 16, 17, 21, 22, 24
మే: 3, 4, 13, 14, 15, 18, 20, 21, 22, 25
జూన్: 1, 3, 5, 8, 9, 10, 15, 17, 18, 19, 22, 23