పెళ్లి తర్వాత త్వరగా పిల్లల్ని కను.. రణబీర్ కు సంజయ్ దత్ సలహా
- పెళ్లి అంటే పరస్పర నిబద్ధత అన్న సంజయ్
- దానికి కట్టుబడి ఉండాలని సూచన
- జీవితాంతం సంతోషం, కీర్తితో వర్ధిల్లాలని విషెస్
ఓ వార్తా సంస్థతో మాట్లాడిన సందర్భంగా రణబీర్ వివాహం విషయమై సంజయ్ దత్ తన అభిప్రాయాలను తెలియజేశారు. ‘‘రణబీర్ కపూర్ పెళ్లి చేసుకునేట్టు అయితే నిజంగా నాకు సంతోషమే. అలియా నా ముందే పుట్టి పెరిగిన అమ్మాయి. వివాహం అన్నదానిపై ఒకరి పట్ల మరొకరు నిబద్ధత కలిగి ఉండడం, కొంత రాజీ పడడం అవసరం. దానికి వారు కట్టుబడి ఉండాలి. ఒకరి చేయి మరొకరు పట్టుకుని సంతోషం, శాంతి, కీర్తితో జీవితంలో ముందుకు సాగిపోవాలి. రణబీర్ త్వరగా పిల్లల్ని కను. సంతోషంగా ఉండు’’ అని సంజయ్ అన్నారు. రణబీర్ కపూర్, అలియా భట్ వివాహం ఈ నెలలోనే ఉంటుందన్న వార్తలు వచ్చాయి కానీ, అధికారికంగా ఇంకా నిర్ధారణ కాలేదు.