పాదాభివందనం చేసి.. చేతులు ముద్దాడి.. కొత్త మంత్రుల విధేయత
- జగన్ చెయ్యిని ముద్దాడిన రోజా
- పాదాభివందనం చేసిన అమర్ నాథ్, జోగి రమేశ్
- ఏపీ సీఎంపై విధేయతను చాటిన కొత్త మంత్రులు
మంత్రి నారాయణ స్వామి, ఉష శ్రీచరణ్ జగన్ పాదాలకు నమస్కారం చేశారు. గుడివాడ అమర్ నాథ్, జోగి రమేశ్ లు ఇంకాస్త ఎక్కువగా తమ విధేయతను చూపించారు. మోకాళ్లమీద వంగి కాళ్లకు నమస్కరించారు. మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత రోజా జగన్ వద్దకు వెళ్లి కాళ్లకు మొక్కారు. ఆయన చేతినీ ముద్దాడారు. ఇలా ఎవరికివారు జగన్ పై తమకున్న విధేయతను చాటుకున్నారు.