అమ్మా.. తిరిగి స్వర్గంలో కలుసుకుందాం: రష్యా దాడిలో బలైపోయిన తల్లికి బాలిక రాసిన లేఖ
- నాకు చక్కని జీవితాన్ని ఇచ్చావు
- ఆకాశంలో ఉన్ననీవు స్వర్గానికి వెళ్లాలి
- నేను మంచి అమ్మాయిగా జీవిస్తా
- అప్పుడు స్వర్గానికి రావచ్చు
- అక్కడే నిన్ను కలుసుకుంటా
- డైరీలో రాసుకున్న ఓ బాలిక
‘‘అమ్మా.. మార్చి 8న ఈ లేఖను నీకు అందిస్తున్నాను. నాకు తొమ్మిదేళ్లపాటు మంచి లైఫ్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. ప్రపంచంలో నీవే గొప్ప అమ్మవు. నిన్ను నేను ఎప్పటికీ మరవను. ఆకాశంలో నీవు సంతోషంగా ఉండాలి. నీవు స్వర్గానికి చేరుకోవాలి. మనం స్వర్గంలోనే కలుసుకుందాం. స్వర్గానికి వెళ్లేందుకు వీలుగా మంచి నడవడికతో ఉంటాను’’ అని బాలిక తన డైరీలో రాసుకుంది.