కొత్త క్యాబినెట్ ఏర్పాటుపై సజ్జల ఏమన్నారంటే...!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కొత్త క్యాబినెట్ ఏర్పాటుపై సజ్జల ఏమన్నారంటే...!

What Sajjala said on new cabinet
  • గత రాత్రి సీఎం జగన్ తో సజ్జల భేటీ
  • నేడు మరోసారి సమావేశం
  • మీడియాకు వివరాలు తెలిపిన సజ్జల
  • కొత్త మంత్రులకు సమాచారం అందిస్తామని వెల్లడి
ఏపీలో కొత్త మంత్రివర్గం కొలువుదీరనుంది. గతరాత్రి సీఎం జగన్ తో సమావేశమై కొత్త క్యాబినెట్ పై చర్చించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నేడు మరోసారి సమావేశమై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కొత్త క్యాబినెట్ పై కసరత్తులు ఇంకా పూర్తికాలేదని వెల్లడించారు. ఆదివారం మధ్యాహ్నం వరకు కూడా కొత్త క్యాబినెట్ ఏర్పాటుపై కసరత్తులు కొనసాగుతాయని వివరించారు. 

నూతన మంత్రివర్గం కొత్త, పాతల కలయికగా ఉంటుందని సజ్జల స్పష్టం చేశారు. ముఖ్యంగా, తాజా క్యాబినెట్ లో మహిళలకు, బీసీలకు సముచిత స్థానం కల్పించడం జరుగుతుందని వివరించారు. కొత్త మంత్రివర్గంలో ఉన్నవారికి రేపు మధ్యాహ్నం తర్వాత ఫోన్ ద్వారా సమాచారం అందిస్తామని చెప్పారు.
Sajjala Ramakrishna Reddy
New Cabinet
CM Jagan
YSRCP
Andhra Pradesh

More Telugu News