బ్రోకర్ల మాఫియాతో కేసీఆర్ కుమ్మక్కు.. రైతులకు లేఖలో బండి సంజయ్ ధ్వజం
- 'రైతులు తక్కువ ధరకే ధాన్యం అమ్ముకునేలా కేసీఆర్ ప్లాన్' అంటూ సంజయ్ విమర్శలు
- కొనుగోలు కేంద్రాల మూత వెనుక పెద్ద కుట్ర ఉందని వ్యాఖ్య
- రైతుల ఆగ్రహాన్ని కేంద్రంపైకి మళ్లించడమే వారి లక్ష్యమన్న సంజయ్
ధాన్యం కొనుగోళ్లలో భారీ ఎత్తున కమీషన్లు దండుకునేందుకు టీఆర్ఎస్ నేతలు స్కెచ్ వేశారని బండి సంజయ్ ఆరోపించారు. ఈ క్రమంలో రైతులు తక్కువ ధరకే ధాన్యం విక్రయించేలా ప్లాన్ రచించారని ఆయన పేర్కొన్నారు. రైతుల్లో వెల్లువెత్తే ఆగ్రహాన్ని కేంద్రంపైకి మళ్లించే కుట్రలో భాగంగానే ధాన్యం కొనుగోలు కేంద్రాలను మూసివేశారని ఆయన ధ్వజమెత్తారు.
కేసీఆర్ రచించిన ఈ కుట్రలో అన్నదాతలకు భారీ ఎత్తున నష్టం వాటిల్లే ప్రమాదముందని కూడా ఆయన ఆరోపించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను తిరిగి తెరిచేలా కేసీఆర్ మెడలు వంచుదాం రండి అంటూ ఆయన రైతులకు పిలుపునిచ్చారు.