విద్యుత్ సంక్షోభానికి వైసీపీ అనాలోచిత విధానాలే కారణం: పవన్ కల్యాణ్
- పల్లెల్లో 14 గంటలు, పట్టణాల్లో 8 గంటల కోతలు
- మొబైల్ ఫోన్ వెలుగులో ప్రసవాలు
- పవర్ హాలిడేతో పారిశ్రామిక అభివృద్ధికి విఘాతమన్న పవన్
పల్లెల్లో 14 గంటలు, పట్టణాల్లో 8 గంటలకు తగ్గకుండా విద్యుత్ కోతలు అమలు చేస్తున్న వైసీపీ సర్కారు... అనధికారికంగా కోతలను మరింత మేర పెంచి అమలు చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పవన్ ఆ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యుత్ కోతల నేపథ్యంలో ఆసుపత్రుల్లో మొబైల్ ఫోన్ వెలుగులో ప్రసవాలు జరుగుతున్నాయంటే పరిస్థితి ఏ మాదిరిగా ఉందో అర్థమవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పవర్ హాలిడే ప్రకటనతో రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి విఘాతం కలుగుతోందన్నారు. ఈ ఫలితంగా 36 లక్షల మంది కార్మికులకు ఉపాధి దూరమవుతోందని పవన్ అన్నారు.