Congress: రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు.. గృహ నిర్బంధం

TPCC Chief Revanth Reddy House Arrest
షార్ట్స్‌లో చూడండి
విద్యుత్ చార్జీల పెంపు, ధాన్యం కొనుగోలు పోరాటంలో భాగంగా నేడు విద్యుత్ సౌధ, సివిల్ సప్లైస్ భవనాల ముట్టడికి తెలంగాణ కాంగ్రెస్ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డిని గృహ నిర్బంధంలోకి తీసుకున్నారు.

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని రేవంత్ ఇంటికి చేరుకున్న పోలీసులు ఆయన బయటకు రాకుండా అడ్డుకున్నారు. పెద్ద సంఖ్యలో అక్కడ పోలీసులు మోహరించారు. అలాగే, మరికొందరు నాయకులను కూడా పోలీసులు గృహనిర్బంధం చేశారు.
Go Back to Shorts
Congress
Telangana
Revanth Reddy
Police
House Arrest

More Telugu News