హైదరాబాద్‌లోని ప‌బ్‌లో డ్ర‌గ్స్ ల‌భ్యం కావ‌డంతో తార్నాక‌లో సోదాలు.. 11 మంది అరెస్టు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హైదరాబాద్‌లోని ప‌బ్‌లో డ్ర‌గ్స్ ల‌భ్యం కావ‌డంతో తార్నాక‌లో సోదాలు.. 11 మంది అరెస్టు

11 drugs suppliers arrest
  • మ‌త్తు ప‌దార్థాల విక్ర‌యాల‌పై పోలీసుల సీరియ‌స్‌
  • హైద‌రాబాద్‌లో వాటిని కట్టడి చేయడానికి చర్యలు 
  • తార్నాక‌లోని ఓయూ పోలీసులతో కలిసి నార్కోటిక్ బృందం సోదాలు
  • మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్న వారి అరెస్టు    
హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్ లోని పుడింగ్ అండ్ మింక్ పబ్‌పై దాడి చేసిన అధికారులకు డ్ర‌గ్స్ కూడా ల‌భ్య‌మైన విష‌యం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైద‌రాబాద్ పోలీసులు మ‌త్తు ప‌దార్థాల విక్ర‌యాల‌పై సీరియ‌స్‌గా ఉన్నారు. హైద‌రాబాద్‌లో మ‌త్తు ప‌దార్థాల వినియోగాన్ని కట్టడి చేయడానికి పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. 

ఈ క్రమంలో తార్నాక‌లోని ఓయూ పోలీసులతో కలిసి నార్కోటిక్ బృందం తార్నాకలో సోదాలు నిర్వహించి, మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్న 11 మందిని అరెస్టు చేసింది. నిందితుల నుంచి నార్కోటిక్ బృందం గంజాయితో పాటు హాష్‌ ఆయిల్‌ను స్వాధీనం చేసుకుంది.
Hyderabad
Police

More Telugu News