సొంత పార్టీకి భారీ విరాళం అందించిన జనసేనాని పవన్ కల్యాణ్

జనసేనాని పవన్ కల్యాణ్ అధ్యక్షతన ఇవాళ పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ జనసేన పార్టీకి రూ.5 కోట్ల భారీ విరాళం ప్రకటించారు. ఈ సమావేశంలోనే రూ.5 కోట్ల చెక్ ను పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, కమిటీ సభ్యుడు నాగబాబులకు అందజేశారు. ఇదే సమావేశంలో పవన్ కల్యాణ్... రాష్ట్రంలో ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు రూ.5 కోట్ల విరాళం ప్రకటించడం తెలిసిందే. అటు, తనవంతుగా నాగబాబు సైతం కౌలు రైతుల కుటుంబాల కోసం రూ.10 లక్షల విరాళం ప్రకటించారు.



More Telugu News