జ‌గ‌న్ ఢిల్లీ టూర్ దేని కోసం?.. ట్విట్ట‌ర్‌లో పోల్ పెట్టిన నారా లోకేశ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జ‌గ‌న్ ఢిల్లీ టూర్ దేని కోసం?.. ట్విట్ట‌ర్‌లో పోల్ పెట్టిన నారా లోకేశ్

nara lokesh tweet pollon ap cm jagan delhi tour
  • నాలుగు అంశాల‌ను ప్ర‌స్తావించిన లోకేశ్
  • పేల‌ని జ‌గ‌న్ హ‌స్తిన ప‌య‌న‌మెందుకంటూ ట్యాగ్‌
  • వైర‌ల్‌గా లోకేశ్ ట్వీట్ పోల్‌
ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం ఢిల్లీ పర్య‌ట‌న‌కు బ‌య‌లుదేరి వెళ్లిన సంగ‌తి తెలిసిందే. ఈ ప‌ర్య‌ట‌న‌పై టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ ట్విట్ట‌ర్ వేదిక‌గా ఓ పోల్ పెట్టారు. ఈ పోల్‌లో అస‌లు జ‌గ‌న్ దేని కోసం ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లార‌ని ప్ర‌శ్నించిన లోకేశ్.. ఓ నాలుగు అంశాల‌ను ప్ర‌స్తావించారు. ఈ నాలుగింటిలో జ‌గ‌న్ దేనికోసం ఢిల్లీకి వెళ్లార‌ని ఆయ‌న పోల్ పెట్టారు.

పేల‌ని జ గ‌న్ హ‌స్తిన ప‌య‌న‌మెందుకు? పేరిట లోకేశ్ సంధించిన ఈ పోల్‌లో తొలి అంశంగా 'బాబాయి హ‌త్య కేసులో దొరికిపోయిన అవినాశ్ రెడ్డిని తప్పించేందుకు' అని పెట్టారు. రెండో అంశంగా 'తాను కొట్టేస్తే కాగ్ ప‌ట్టేసిన రూ.48 వేల కోట్ల వ్య‌వ‌హారాన్ని కామ‌ప్ చేసేందుకు' అని పేర్కొన్నారు. ఇక మూడో అంశంగా త‌న‌పై సీబీఐ, ఈడీ కేసుల ద‌ర్యాప్తును ఆపేయాల‌ని అని పేర్కొన్నారు. నాలుగో అంశంగా ల‌క్ష కోట్ల ఆస్తిలో చెల్లికి చిల్లిగ‌వ్వ కూడా ఇవ్వ‌కుండా మ‌హిళ‌ల‌కు ఆస్తి హ‌క్కు ర‌ద్దు చేయాల‌ని అని పేర్కొన్నారు. ఈ ట్వీట్ పోల్ ఇప్పుడు వైర‌ల్ గా మారింది. 
TDP
Nara Lokesh
Jagan Delhi Tour
Poll

More Telugu News