చాలా కాలం తర్వాత మళ్లీ వైట్ హౌస్ కు రానున్న ఒబామా
- అధికారిక కార్యక్రమానికి హాజరు
- అధ్యక్షుడు బైడెన్ తో కలసి పంచుకోనున్న వేదిక
- ప్రకటన విడుదల చేసిన వైట్ హౌస్
‘‘లక్షలాది మంది అమెరికన్లకు అందుబాటు ధరకే అందిస్తున్న ‘అఫర్డబుల్ కేర్ యాక్ట్ అండ్ మెడిక్ ఎయిడ్’ విజయోత్సవ కార్యక్రమంలో అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తో కలసి ఒబామా పాల్గొంటారు’’ అంటూ వైట్ హౌస్ అధికారి ప్రకటించారు. అఫర్డబుల్ హెల్త్ ఇన్సూరెన్స్ ను ఒబామా హయాంలోనే ప్రారంభించారు. దీని బలోపేతానికి అధ్యక్షుడు బైడెన్ మరిన్ని చర్యలు తీసుకుంటారని, కుటుంబాలకు మరిన్ని డాలర్లను ఆదా చేయడమే దీని లక్ష్యమని వైట్ హౌస్ అధికారి పేర్కొన్నారు.