ఐపీఎల్ లో నేడు రెండు మ్యాచ్ లు... రాజస్థాన్ పై టాస్ నెగ్గిన ముంబయి

Mumbai won the toss against Rajasthan Royals
వారాంతం కావడంతో నేడు ఐపీఎల్ లో రెండు మ్యాచ్ లు నిర్వహిస్తున్నారు. తొలి మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. ముంబయిలోని డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ పోరులో టాస్ నెగ్గిన ముంబయి ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. ముంబయి పిచ్ లు బ్యాటింగ్ కు అనుకూలిస్తుండడంతో ఇప్పటివరకు ఛేదనకు దిగిన జట్లకు పరిస్థితులు అనుకూలిస్తున్నాయి. అందుకే మరో ఆలోచన లేకుండా బౌలింగ్ తీసుకున్నామని టాస్ సందర్భంగా రోహిత్ శర్మ వెల్లడించాడు.
Go Back to Shorts
Mumbai Indians
Toss
Rajasthan Royals
IPL

More Telugu News