నామినేషన్స్ నుంచి సేవ్ చేయండి.. లైవ్ లో టీషర్ట్ తీసేస్తా: పూనమ్ పాండే

  • అభిమానులకు ఆఫర్
  • ‘లాకప్’ రియాలిటీ షోలో పాండే ప్రకటన
  • ఇచ్చిన హామీకి కట్టుబడి ఉంటానని వెల్లడి
  • ఒట్టి మాటలన్న సహచరుడు వినీత్ కాకర్
రియాలిటీ షో ‘లాకప్’లో పాల్గొంటున్న నటి పూనమ్ పాండే తన అభిమానులకు సంచలన ఆఫర్ ఇచ్చింది. తనను నామినేషన్స్ నుంచి కాపాడితే ఒంటిపై టీషర్ట్ ను లైవ్ లో తీసేస్తానని ప్రకటించింది. ఈ వారం చార్జ్ షీట్ లోకి తాను వెళ్లకుండా ఓటింగ్ తో కాపాడాలంటూ అభిమానులను వేడుకొంది.

లాకప్ షోలో మునావర్, అజంలి, అజ్మా, అలీ మర్చంట్, వినీత్ కాకర్ తో ఆమె పోటీ పడుతోంది. తాజా షోలో ఆమె మాట్లాడుతూ.. ‘‘ఈ సమయంలో నన్ను చూస్తున్న వారిని నేను కోరేది ఒక్కటే. ఈ వారం చార్జ్ షీట్ నుంచి నన్ను బయటపడేయండి. నేను మీకు కెమెరా ముందు పెద్ద సర్ ప్రైజ్ ఇస్తాను’’ అని ప్రకటన చేసింది. 

పాండే ప్రకటన పట్ల ఆమె సహచరుల్లోనే ఆసక్తి ఏర్పడింది. ఆ సర్ ప్రైజ్ ఏంటో అభిమానులకు చెప్పాలని మునావర్, అజ్మ పాండేను కోరారు. కనీసం ట్రెయిలర్ అయినా చూపించాలంటూ జోక్ చేశారు. ఆమె చెప్పేది కేవలం ఒట్టి మాటలేని వినీత్ కాకర్ విమర్శించాడు. దీనికి పాండే స్పందిస్తూ ఇచ్చిన హామీకి కట్టుబడి ఉంటానని ప్రకటించింది. నామినేషన్స్ నుంచి తనను రక్షిస్తే లైవ్ లో టీ షర్ట్ తీసేస్తానని చివరిగా ప్రకటించింది.

Poonam Pandey
promises
t shirt
live
lock upp

More Telugu News