ఆ పని చేయలేకపోతే కేసీఆర్ తప్పుకోవాలి: ఈటల రాజేందర్
- పెంచిన విద్యుత్, బస్ ఛార్జీల నుంచి ప్రజల దృష్టి మరల్చుతున్నారు
- రైతుల నుంచి ప్రతి గింజను కొనాలి
- మిగులు విద్యుదుత్పత్తి చేస్తున్న రాష్ట్రంలో కరెంట్ బిల్లులను పెంచడం ఏమిటన్న ఈటల
17 వేల యూనిట్ల మిగులు విద్యుదుత్పత్తి చేస్తున్న రాష్ట్రంలో కరెంట్ బిల్లులను పెంచడం ఏమిటని ఎద్దేవా చేశారు. కోటి మందికి రైతుబంధు ఇస్తే 35 లక్షల ఎకరాల్లో మాత్రమే పంట రావడం విడ్డూరంగా ఉందని ఈటల అన్నారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఐసీయూలో ఉన్న పేషెంట్ ను ఎలుకలు కొరికిన ఘటనలో ఆసుపత్రి సూపరింటెండెంట్ ను శిక్షిస్తే ఎలాగని ప్రశ్నించారు. నిధులు కేటాయించకపోతే ఆసుపత్రులు ఎలా మెరుగవుతాయని అడిగారు.