అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ ఢీకొని ముగ్గురి మృతి
- జిల్లాలోని మిడుతూరు వద్ద ఘటన
- ఆగివున్న లారీని ఢీకొన్న బస్సు
- బెంగళూరు నుంచి బస్సు హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం
- మరో 15 మందికి తీవ్ర గాయాలు
ఈ ఘటనలో లారీలో ఉన్న ఇద్దరు, బస్సులోని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.