ఆసుపత్రిలో ఎలుకల ఎఫెక్ట్... ఎంజీఎం సూపరింటెండెంట్, వైద్యులపై వేటు
- ఎంజీఎం ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి హరీశ్
- సూపరింటెండెంట్‌పై బదిలీ వేటు
- ఇద్దరు వైద్యులపై సస్పెన్షన్
- తెలంగాణ సర్కారు ఉత్తర్వులు జారీ
ఈ ఘటనపై మంత్రి తన్నీరు హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఆయన ప్రకటించారు. మంత్రి ప్రకటనకు అనుగుణంగానే చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.. సూపరింటెండెంట్‌పై బదిలీ వేటు వేయడంతో పాటుగా ఇద్దరు వైద్యులను సస్పెండ్ చేసింది.