Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హైద‌రాబాద్‌లో భారీగా డ్ర‌గ్స్ ప‌ట్టివేత‌.. రెండు ముఠాల అరెస్ట్‌

hyderabad police arrests two drugs hanhs
  • జూబ్లీహిల్స్‌, న‌ల్ల‌కుంటలో పోలీసుల దాడులు
  • భారీ ఎత్తున డ్ర‌గ్స్ ప‌ట్టివేత‌
  • న‌ల్ల‌కుంటలో డ్ర‌గ్స్ కొనుగోలుదారుల ప‌ట్టివేత‌
భాగ్య‌న‌గ‌రి హైద‌రాబాద్‌లో మ‌రోమారు డ్ర‌గ్స్ క‌ల‌క‌లం రేగింది. డ్ర‌గ్స్ అధిక మోతాదులో సేవించిన కార‌ణంగా ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ ఓ యువ‌కుడు చ‌నిపోయిన ఘ‌ట‌న వెలుగు చూసిన వెనువెంట‌నే.. న‌గ‌రంలో భారీ స్థాయిలో డ్ర‌గ్స్ ప‌ట్టుబ‌డ్డాయి. న‌గ‌రంలోని జూబ్లీహిల్స్‌, న‌ల్ల‌కుంట ప‌రిధిలో డ్ర‌గ్స్ విక్ర‌యిస్తున్న‌ట్లుగా స‌మాచారం అందుకున్న పోలీసులు.. రెండు ప్రాంతాల్లో రెండు ముఠాల‌ను అరెస్ట్ చేశారు. ఈ ముఠాల నుంచి ఎల్ఎస్‌డీ, హ్యాష్ అయిల్ స‌హా భారీ మొత్తంతో డ్ర‌గ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

ఇదిలా ఉంటే.. న‌ల్ల‌కుంట ప‌రిధిలో పోలీసుల‌కు చిక్కిన ముఠాలోని ఓ వ్య‌క్తిని డ్ర‌గ్స్ విక్రేత‌గా గుర్తించ‌గా.. అత‌డి వ‌ద్ద డ్ర‌గ్స్ కొనుగోలు చేసేందుకు వ‌చ్చిన ముగ్గురు యువ‌కుల‌ను పోలీసులు అరెస్ట్ చేసిన‌ట్లుగా తెలుస్తోంది. ఇక జూబ్లీహిల్స్‌లో ప‌ట్టుబ‌డిన గ్యాంగ్‌లో ఎంత‌మంది ఉన్నార‌న్న విష‌యంపై వివ‌రాలు తెలియ‌రాలేదు.
Drugs
Hyderabad
Jubilee Hills
Nallakunta

More Telugu News