ఢిల్లీలో టీపీసీసీ నేతలు.. రాహుల్‌తో మొదలైన భేటీ
- రేవంత్ సహా 14 మందికి రాహుల్ అపాయింట్ మెంట్
- టీపీసీసీలో వరుస విభేదాలపైనే కీలక చర్చ
- తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై చర్చించే అవకాశం
పార్టీలో విభేదాలతో పాటుగా తెలంగాణ అసెంబ్లీకి త్వరలో జరిగే ఎన్నికలకు సంబందించి పార్టీ వ్యూహంపై కూడా ఈ భేటీలో చర్చించనున్నట్లు సమాచారం. టీపీసీసీలో విభేదాల నేపథ్యంలో ఎవరికి వారే పార్టీ అధిష్ఠానం అపాయింట్మెంట్లు అడుగుతున్న నేపథ్యంలో స్వయంగా రాహుల్ గాంధీనే ఈ భేటీకి ప్లాన్ చేసినట్టు చెబుతున్నారు. రేవంత్ సహా 14 మంది టీపీసీసీ నేతలకు ఆయన ఆపాయింట్ మెంట్ ఇవ్వగా... వారంతా ఇప్పటికే ఢిల్లీకి చేరుకుని కాసేపటి క్రితం రాహుల్‌తో మొదలైన భేటీకి హాజరయ్యారు.