K Kavitha: అమెరికాలో మేనల్లుడితో కేటీఆర్ ఫొటో.. ట్విట్టర్ లో పోస్ట్ చేసిన కవిత

ktr met his sisters son aaditya in america
షార్ట్స్‌లో చూడండి
అమెరికాలో వారం పాటు బిజీబిజీగా ప‌ర్య‌ట‌న సాగించిన టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌.. త‌న ప‌ర్య‌ట‌నను ముగించుకుని తిరుగు ప్ర‌యాణ‌మ‌య్యే స‌మ‌యంలో అక్క‌డే విద్య‌న‌భ్య‌సిస్తున్న త‌న మేన‌ల్లుడు, త‌న తోబుట్టువు క‌విత కుమారుడు ఆదిత్య‌ను క‌లిశారు. ఈ సంద‌ర్భంగా మేనల్లుడితో క‌లిసి కేటీఆర్ ఓ సెల్ఫీ తీసుకోగా.. దానిని తాజాగా క‌విత ట్విట్ట‌ర్ వేదిక‌గా పోస్ట్ చేశారు. 

అమెరికా ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్న త‌న సోద‌రుడు.. ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ అక్క‌డే చ‌దువుతున్న త‌న మేన‌ల్లుడిని క‌లిసే విష‌యాన్ని మాత్రం మ‌రిచిపోలేదంటూ క‌విత స‌ద‌రు ఫొటోకు ఓ కామెంట్ యాడ్ చేశారు.
Go Back to Shorts
K Kavitha
KTR
TRS

More Telugu News