కొడాలి నాని లాంటి విశ్వాసం లేని కుక్కలను చంద్రబాబు పెంచారు: బుద్ధా వెంకన్న
- వెన్నుపోటంటే ఏమిటో జగన్ కు బాగా తెలుసు
- బాబాయిని, సొంత చెల్లెలిని వెన్నుపోటు పొడిచారు
- కొడాలి నాని లాంటి నీచులను తరిమికొట్టాలన్న వెంకన్న
అయితే, వెన్నుపోటంటే ఏమిటో జగన్ కు బాగా తెలుసని... తన తండ్రి వైయస్ ను బెదిరించి బాబాయ్ వివేకాకు వెన్నుపోటు పొడిచారని చెప్పారు. అప్పుడు సొంత కుటుంబసభ్యులు కూడా జగన్ కు మద్దతు ఇవ్వలేదని అన్నారు.
టీడీపీని కాపాడి అధికారంలోకి తెచ్చిన ఘనత చంద్రబాబుదని... బాబాయిని చంపిన వారిని కాపాడుతున్న వ్యక్తి జగన్ అని... ఇద్దరిలో వెన్నుపోటుదారుడు ఎవరని ప్రశ్నించారు. తన విజయం కోసం పని చేసిన సొంత చెల్లెలికే వెన్నుపోటు పొడిచిన చరిత్ర జగన్ దని అన్నారు.
'పప్పు అంటూ కారుకూతలు కూసే కొడాలి నానీ... మీ నాయకుడు గన్నేరుపప్పు అనే విషయం తెలుసుకో' అని వెంకన్న ఎద్దేవా చేశారు. కొడాలి నాని లాంటి విశ్వాసం లేని కుక్కలను చంద్రబాబు పెంచి పోషించారని అన్నారు. కొడాలి నాని లాంటి నీచులను తరిమికొట్టాలని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ గురించి మాట్లాడే కొడాలి నాని... వారి కుటుంబసభ్యులను సిగ్గులేకుండా తిడతారని మండిపడ్డారు.
హత్యా రాజకీయాల చరిత్ర జగన్ దని అన్నారు. చంద్రబాబే రౌడీయిజం చేసేవారైతే నాని లాంటి వారి నోళ్లు లేచేవా? అని ప్రశ్నించారు. వీరులు పుట్టిన గడ్డలో కొడాలి నాని లాంటి సన్యాసులు ఎలా పుట్టారని అన్నారు. ఏనుగులు పోతుంటే కుక్కలు మొరుగుతాయని.. కొడాలి నాని లాంటి వాళ్లు కుక్కల కంటే హీనమని మండిపడ్డారు. జగన్ దగ్గర మార్కులు పడతాయని చంద్రబాబును నాని తిడుతున్నాడని.. ఆయన మాట్లాడే ప్రతి మాట నాశనానికే దారి తీస్తుందని చెప్పారు.