High Court: టాలీవుడ్ డ్ర‌గ్స్ కేసులో ఈడీ అడిగిన వివ‌రాలన్నిటినీ ఇచ్చిన‌ట్లు హైకోర్టుకు తెలిపిన‌ ఎక్సైజ్ శాఖ

excise deportment fiels memo in high court
షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ డ్ర‌గ్స్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) అధికారులు అడిగిన వివ‌రాలు అన్నింటినీ తాము ఇచ్చిన‌ట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఈ మేర‌కు ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో ఎక్సైజ్ శాఖ‌ మెమో దాఖ‌లు చేసింది. కొన్ని రోజుల క్రితం ఎక్సైజ్ శాఖ‌పై ఈడీ కోర్టు ధిక్క‌ర‌ణ పిటిష‌న్ దాఖ‌లు చేసి, ఆ శాఖ త‌మ‌కు డిజిట‌ల్ రికార్డుల‌తో పాటు కాల్ డేటా ఇవ్వ‌లేద‌ని తెలిపింది. 

టాలీవుడ్ డ్ర‌గ్స్ కేసులో విచార‌ణ‌కు త‌మ‌కు ఎక్సైజ్ శాఖ స‌హ‌క‌రించ‌ట్లేద‌ని చెప్పింది. దీంతో ఈడీ కోరిన వివ‌రాలు అందించి, ఈ కేసులో స‌హ‌కరించాల‌ని ఎక్సైజ్ శాఖ‌ను కోర్టు ఆదేశించింది. ఈ నేప‌థ్యంలో ఈడీ అడిగిన వివ‌రాలు ఇచ్చామ‌ని ఈ రోజు హైకోర్టుకు ఎక్సైజ్ శాఖ తెలిపింది.
Go Back to Shorts
High Court
Tollywood

More Telugu News