నయీం కేసులో కీలక పరిణామం.. రూ.150 కోట్ల ఆస్తుల సీజ్
- షాద్ నగర్ ఎన్కౌంటర్లో నయీం మృతి
- తాజాగా ఈ కేసులో ఐటీ శాఖ జోక్యం
- బినామీల పేరిట ఉన్న ఆస్తుల సీజ్
- నయీం భార్య హాసినికి నోటీసులు
పోలీసు శాఖలోని పలువురు కీలక అధికారులతో స్నేహ సంబంధాలు కొనసాగించిన నయీం పెద్ద ఎత్తున దందాలకు పాల్పడ్డట్టుగా గతంలో ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో నయీంపై మరింత మేర ఆరోపణలు రావడంతో అప్పట్లో అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో నయీం కోసం వేట సాగించిన తెలంగాణ పోలీసులు అతనిని షాద్ నగర్లో ఎన్కౌంటర్ లో హతం చేసిన సంగతి తెలిసిందే.