ఇండియాలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. మరణాలు కూడా భారీగా తగ్గిన వైనం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇండియాలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. మరణాలు కూడా భారీగా తగ్గిన వైనం!

India registers 1270 new COVID cases
  • గత 24 గంటల్లో 1,270 పాజిటివ్ కేసుల నిర్ధారణ
  • కరోనా కారణంగా 31 మంది మృతి
  • దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 15,859
ఇండియాలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. గత 24 గంటల్లో 4,32,389 మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా... కొత్తగా 1,270 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇదే సమయంలో మరణాల సంఖ్య కూడా తగ్గింది. ముందు రోజు 149 మంది కరోనా కారణంగా మృతి చెందగా... గత 24 గంటల్లో 31 మంది చనిపోయారు. నిన్న కరోనా నుంచి 1,567 మంది కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 15,859గా ఉంది. రికవరీ రేటు 98.75 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 183 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ డోసులు వేశారు. నిన్న ఒక్క రోజే 4,20,842 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 4,24,83,829 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
India
Corona Virus
Updates

More Telugu News