తిరుమల ఘాట్ రోడ్డులో మంటల్లో చిక్కుకున్న టీటీడీ ధర్మరథం బస్సు
- ఎగువ కనుమ రహదారిలో ప్రమాదం
- బస్సు ఇంజిన్ లో మంటలు
- అప్రమత్తమైన డ్రైవర్
- మంటలను ఆర్పివేసిన అగ్నిమాపక సిబ్బంది
ఆ సమయంలో బస్సులో భక్తులెవరూ లేరని తెలుస్తోంది. తిరుమల లింక్ రోడ్డు వద్ద ఈ ఘటన జరిగింది. బస్సు ఇంజిన్ లో షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు.