టెన్త్ విద్యార్థిని ఆత్మహత్యపై నారా లోకేశ్ భావోద్వేగం.. వైసీపీపై తీవ్ర విమర్శలు
- చిత్తూరు జిల్లాలో టెన్త్ విద్యార్థి బలవన్మరణం
- అందుకు వైసీపీ నేతలే కారణమని ఆరోపణలు
- బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని లోకేశ్ డిమాండ్
మిస్బా ఆత్మహత్యకు కారకులైన వైసీపీ నేతలను ఆయన తాలిబన్లను మించిన కరుడుగట్టిన ఉగ్రవాదులుగా అభివర్ణించారు. వైకాపాకన్ల కంటే కూడా తాలిబన్లు నయమంటూ లోకేశ్ విమర్శించారు. పదో తరగతి పేపర్లు ఎత్తుకొచ్చిన చరిత్ర జగన్‌ది అయితే.. ఆయన పార్టీ నేతలది పదో తరగతిలో తన కూతురు టాపర్‌గా నిలవాలన్న భావనతో నిరుపేద విద్యార్థిని ఏకంగా వెంటాడి వేధించి బలవన్మరణానికి పాల్పడేలా చేసిన నీచ చరిత్ర అంటూ లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.