ఎన్నికల సంఘం ఆదేశాలు బేఖాతరు.. పాక్ ప్రధాని ఇమ్రాన్‌కు జరిమానా
- కైబర్-ఫఖ్తున్క్వాలో స్థానిక సంస్థల ఎన్నికలు
- అమల్లో ఉన్న ఎన్నికల కోడ్
- నియమావళి ఉల్లంఘించి ర్యాలీ, ప్రసంగం
దీనిని తీవ్రంగా పరిగణించిన ఈసీపీ ఇమ్రాన్‌కు రూ.50 వేల జరిమానా విధించింది. కైబర్-ఫఖ్తున్క్వాలో ఈ నెల 31న రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ అధికారులు ఎవరూ పర్యటించరాదని ఈసీపీ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన ఇమ్రాన్‌కు ఈసీపీ రెండుసార్లు నోటీసులు జారీ చేసింది. అయితే, ఈ నోటీసులను సవాలు చేస్తూ ఇమ్రాన్, ప్రణాళికా శాఖ మంత్రి అసద్ ఒమర్ ఇస్లామాబాద్ హైకోర్టును ఆశ్రయించగా అక్కడా వారికి ఎదురుదెబ్బ తగిలింది.