టీడీపీ ఎమ్మెల్యేల అరెస్ట్.. టీడీపీ శ్రేణులకు, పోలీసులకు మధ్య తోపులాట
- ప్రసాదంపాడులో ఘటన
- ఎక్రైజ్ కమిషనర్ కార్యాలయానికి టీడీపీ ఎమ్మెల్యేలు
- నాటుసారా మరణాలపై వినతి పత్రం అందజేసేందుకు యత్నం
- అడ్డుకుని అరెస్ట్ చేసిన పోలీసులు
ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఇటీవలే చోటుచేసుకున్న నాటుసారా మరణాలపై ఎక్సైజ్ కమిషనర్‌కు వినతి పత్రం ఇచ్చేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు నిర్ణయించారు. నగరంలోని ప్రసాదంపాడులో ఉన్న ఎక్సైజ్ శాఖ కమిషనర్ కార్యాలయానికి వారంతా బయలుదేరారు.
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ముందుగానే అక్కడకు చేరుకుని టీడీపీ ఎమ్మెల్యేలను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసుల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ ఎమ్మెల్యేలు కనీసం వినతి పత్రం సమర్పణకు కూడా తమను అనుమతించరా? అంటూ మండిపడ్డారు.