ఆర్ఆర్ఆర్ సినిమాపై రాజుకున్న వివాదం.. కర్ణాటకలో నిషేధం విధించాలని పెద్ద ఎత్తున డిమాండ్
- ఎల్లుండి విడుదల అవుతున్న ఆర్ఆర్ఆర్
- కన్నడలో విడుదల కావట్లేదని కన్నడిగుల ఆగ్రహం
- ఇది తమ భాషను అవమానించడమేనని ఆగ్రహం
- BoycottRRRinKarnataka హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో..
ఇటీవల కర్ణాటకలోనూ ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. దీనికి కర్ణాటక సీఎం బొమ్మై కూడా వచ్చారు. అయినప్పటికీ, ఈ సినిమాను కన్నడ భాషలో విడుడల చేయలేకపోతుండడంతో ఇది తమ భాషను అవమానించడమేనని కర్ణాటక ప్రజలు అంటున్నారు. ఇందుకు సంబంధించిన BoycottRRRinKarnataka హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.