ప.గో. జిల్లాలో కలకలం.. శివాలయం ఆవరణలోనే అర్చకుడిని రాళ్లతో కొట్టి హత్య చేసిన వైనం
- నిడదవోలు మండలం తాడిమల్లలో ఘటన
- మృతుడి పేరు వెంకట నాగేశ్వరరావు
- దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితులను గుర్తు పట్టేందుకు స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. హత్యకు గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.