బన్నీ బాటలోనే నడుస్తున్న నాని!

Dasara movie upadate
  • కథాకథనాలపై దృష్టిపెడుతూ వచ్చిన నాని 
  • ఇటీవల కాలంలో లుక్స్ పై ప్రత్యేక శ్రద్ధ 
  • 'శ్యామ్ సింగ రాయ్'లో కొత్తగా కనిపించిన నాని
  • ఆ తరువాత సినిమాల్లోను అదే తీరు
బన్నీ కెరియర్ ను పరిశీలిస్తే ఆయన తన ప్రతి సినిమాకి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాడనే విషయం అర్థమవుతుంది. తన ప్రతి సినిమా అంతకుముందు సినిమాకంటే భిన్నంగా ఉండాలని భావిస్తుంటాడు. పాత్రకి తగిన విధంగా ఎప్పటికప్పుడు కొత్తగా ప్రేక్షకులకు కనిపించడానికి ప్రయత్నిస్తుంటాడు. ఆయన పాత పోస్టర్లపై లుక్ చూసి అది ఏ సినిమాకి సంబంధించినదో చెప్పచ్చు. 

చూస్తుంటే ఇప్పుడు నాని కూడా అదే రూట్లో వెళుతున్నట్టుగా కనిపిస్తోంది. మొదటి నుంచి కూడా నాని లుక్స్ పరమైన మార్పుల వైపు వెళ్లకుండా కాలనీ కుర్రాడిలా కనిపిస్తూ, కథలో కొత్తదనానికి మాత్రమే ప్రాధాన్యతనిస్తూ వచ్చాడు. నేచురల్ స్టార్ గా ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. అలాంటి నాని ఈ మధ్య కాలంలో సినిమా సినిమాకి లుక్ మార్చేస్తూ వస్తున్నాడు. 

'శ్యామ్ సింగ రాయ్' సినిమాలో నాని చాలా డిఫరెంట్ లుక్ తో డీసెంట్ గా కనిపించాడు. ఆ సినిమాపై ఆసక్తి రేకెత్తడానికి ఆయన లుక్ ప్రధానమైన కారణంగా నిలిచిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆ తరువాత ఆయన 'అంటే .. సుందరానికీ' సినిమాలో మీసాలు లేకుండా అమాయకత్వంతో కూడిన కొత్త లుక్ తో కనిపించనున్నాడు. 

ఇక 'దసరా' సినిమాకి సంబంధించిన పోస్టర్లోను ఆయన లుక్ పూర్తి భిన్నంగా ఉంది. ఊరమాస్ లుక్ తో ఆయన ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాడు. ఈ ఏడాదిలోనే రానున్న ఈ రెండు సినిమాలతో నాని మరోసారి హ్యాట్రిక్ హిట్ అందుకుంటాడేమో చూడాలి.
Go Back to Shorts
Nani
Keerthi Suresh
Dasara Movie

More Telugu News