టీడీపీతో పొత్తు ఉంటుందని మేమెక్కడా చెప్పలేదు: సోము వీర్రాజు
- కర్నూలులో బీజేపీ శిక్షణ కార్యక్రమం
- హాజరైన సోము వీర్రాజు
- టీడీపీతో పొత్తు కథనాలు మీడియా సృష్టి అని వెల్లడి
- జనసేనతో కలిసి ఎన్నికలకు వెళతామని స్పష్టీకరణ
ఇటీవలే జనసేనాని పవన్ కల్యాణ్.... ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు బీజేపీ రోడ్ మ్యాప్ కోసం ఎదురుచూస్తున్నామని అన్నారు. పైగా, ఈసారి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చే ప్రసక్తేలేదన్నారు. దాంతో, బీజేపీ-జనసేన కూటమితో టీడీపీ కూడా కలుస్తుందేమోనన్న ఊహాగానాలు బయల్దేరాయి. అయితే, సోము వీర్రాజు తాజా వ్యాఖ్యలతో ఇప్పటివరకు పొత్తు ప్రతిపాదనలేవీ లేవన్న విషయం అర్థమవుతోంది.