ఉక్రెయిన్ లో హింసకు రష్యా వెంటనే ముగింపు పలకాలి: భారత్, జపాన్ ప్రధానుల సంయుక్త ప్రకటన
- భారత్ లో జపాన్ ప్రధాని పర్యటన
- ప్రధాని మోదీతో సమావేశం
- రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంపై సమాలోచనలు
ఉక్రెయిన్ పై రష్యా సేనల దాడులు అంతర్జాతీయ కట్టుబాట్ల మూలాలను కుదిపేశాయని జపాన్ ప్రధాని కిషిద వ్యాఖ్యానించారు. ఏకపక్ష చర్యలతో పరిస్థితులను బలవంతంగా మార్చాలనుకోవడాన్ని తాము అనుమతించబోమని స్పష్టం చేశారు. అన్ని విభేదాలను అంతర్జాతీయ చట్టాలకు లోబడి శాంతియుతంగా పరిష్కరించుకోవాలని కిషిద పిలుపునిచ్చారు.
ఈ తరుణంలో కొత్త ప్రపంచ క్రమం కోసం కృషి చేయాల్సి ఉందని, ఐక్యరాజ్యసమితి భద్రతామండలిని సంస్కరించాలని తెలిపారు. ప్రపంచాన్ని అణ్వాయుధ రహితంగా మార్చాల్సి ఉందని పేర్కొన్నారు.