రేపటికి తుపానుగా మారనున్న అసాని.. ఎల్లుండి తీరాన్ని దాటుతుంది: ఐఎండీ
- అండమాన్ సమీపంలో కొనసాగుతున్న అల్పపీడనం
- నేడు వాయుగుండంగా మార్పు
- కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు
- హెల్ప్ లైన్ల ఏర్పాటు
ఆదివారం ఉదయానికి పోర్ట్ బ్లెయిర్ కు ఆగ్నేయంగా 210 కిలోమీటర్ల దూరంలో ఈ అల్పపీడనం నెలకొని ఉంది. మార్చి 22వ తేదీ నాటికి బంగ్లాదేశ్ - మయన్మార్ తీరాలను తాకొచ్చని ఐఎండీ అంచనా వేసింది. అండమాన్ అండ్ నికోబార్ ప్రాంతాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. హెల్ప్ లైన్లను కూడా ఏర్పాటు చేశారు.