రోజాకు పోటీగా వాణీ విశ్వనాథ్.. జనసేన నుంచి పోటీ చేయాలంటూ జనసైనికుల హంగామా!
- వేడెక్కుతున్న నగరి రాజకీయం
- నగరి బరిలోకి దిగేందుకు వాణీ విశ్వనాథ్ ప్రయత్నాలు
- జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తే గెలిపించుకుంటామన్న జనసైనికులు
మరోవైపు నగరి నియోజకవర్గం పుత్తూరులో జనసైనికులు ఈరోజు హంగామా చేశారు. వాణీ విశ్వనాథ్ బ్యానర్లు పట్టుకుని నినాదాలు చేశారు. జనసేనలో చేరి ప్రజలకు సేవ చేయాలని బ్యానర్లపై రాశారు. వాణీ విశ్వనాథ్ జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తే గెలిపించుకుంటామని వారు పేర్కొన్నారు. మరోవైపు ఇటీవలి పర్యటన సందర్భంగా వాణీ విశ్వనాథ్ మాట్లాడుతూ నగరితో తనకు అనుబంధం ఉందని తెలిపారు. తన అమ్మమ్మ నగరిలో నర్సుగా పని చేశారని చెప్పారు. ఆ అనుబంధంతో తాను నగరి ప్రజలకు మరింత దగ్గరవుతానని తెలిపారు.