40 మందితో వెళ్తున్న ప్రైవేటు బస్సు బోల్తా.. 8 మంది మృతి.. 25 మందికి గాయాలు
- ఆంధ్ర-కర్ణాటక సరిహద్దులో ప్రమాదం
- మృతుల సంఖ్య పెరిగే అవకాశం
- బాధితుల్లో తెలుగు వారు కూడా?
వైఎన్ హొసకోట నుంచి పావగడకు బస్సు వెళ్తున్న సమయంలో అధిక వేగం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బస్సు అదుపు తప్పిన వెంటనే బస్సులోంచి చాలా మంది కిందకు దూకేయడంతోనే మరణాలు సంభవించినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని పావగడలోని ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మృతుల కుటుంబాలను ఆదుకుంటామని, గాయాలపాలైన వారికి మెరుగైన చికిత్స అందిస్తామని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. బాధితుల్లో తెలుగు వారు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.