Pushpa: 'పుష్ప'లోని శ్రీ‌వ‌ల్లి పాట ట్యూన్ వాడిన‌ ముంబై పోలీస్‌ బ్యాండ్.. వీడియో

  • శ్రీవల్లీ పాట ట్యూన్‌ను వాయించిన వైనం
  • పాట‌కు ఇప్ప‌టికీ త‌గ్గ‌ని క్రేజ్
  • ఇప్ప‌టికే ఆ పాట‌కు క్రికెట‌ర్లూ డ్యాన్స్
police uses srivalli tune

ముంబై పోలీస్‌ బ్యాండ్‌కు చెందిన స‌భ్యులు పుష్ప సినిమాలోని శ్రీవల్లీ పాట ట్యూన్‌ను వాయించారు. ఇందుకు సంబంధించిన‌ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అల్లు అర్జున్, ర‌ష్మిక మంద‌న్నా న‌టించిన పుష్ప సినిమా విడుద‌లై ఇన్ని రోజులు అవుతున్న‌ప్ప‌టికీ శ్రీ వ‌ల్లి పాట‌కు ఏ మాత్రం క్రేజు త‌గ్గ‌లేద‌ని ఈ వీడియో నిరూపిస్తోంద‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. 

పుష్ప సినిమాలోని శ్రీ‌వ‌ల్లి పాట‌కు ఇప్ప‌టికే క్రికెట‌ర్లు, ఇత‌ర రంగాల‌లోని వారు కూడా డ్యాన్సులు చేస్తూ ముచ్చ‌ట‌ప‌డిపోయారు. ఇప్పుడు ఆ ట్యూన్‌ను పోలీసులు కూడా వాడుతుండ‌డం గ‌మ‌నార్హం.   
       

More Telugu News