సీఎం సీట్లో భగవంత్!.. ఆఫీస్‌లో భగత్ సింగ్, అంబేద్కర్ ఫొటోలు మాత్రమే!
- పంజాబ్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన మాన్
- తన ఛాంబర్‌లో భగత్ సింగ్, అంబేద్కర్ ఫొటోలు మాత్రమే
- ముందే ప్రకటించిన భగవంత్ మాన్
ఈ సందర్భంగా సీఎం ఛాంబర్‌లో ఆసక్తికర దృశ్యం కనిపించింది. భగవంత్ మాన్ సీటు వెనుక గోడలపై భగత్ సింగ్ ఫొటోతో పాటు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఫొటో మాత్రమే కనిపించింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన సమయంలో ఆప్ విజయం ఖరారైన మరుక్షణమే పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన మాన్.. తన కార్యాలయంలో భగత్ సింగ్, అంబేద్కర్ ఫొటోలు మాత్రమే ఉంటాయని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మేరకే తన కార్యాలయంలో వారిద్దరి ఫొటోలు మినహా మరే ఫొటోను కూడా మాన్ అనుమతించకపోవడం గమనార్హం.