ప్రధాని మోదీతో కోమటిరెడ్డి భేటీ.. సింగరేణిలో స్కామ్‌పై ఫిర్యాదు
- పార్లమెంటు ఆవరణలోనే భేటీ
- భువనగిరి అభివృద్దిపై వినతులు
- సింగరేణిలో పెద్ద స్కాం అంటూ కంప్లైంట్
తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనుల్లో ఏకంగా రూ.50 వేల కోట్లకు పైగా నిధుల మేర భారీ స్కామ్ జరిగిందని ప్రధానికి కోమటిరెడ్డి తెలియజేశారు. ఈ కుంభకోణానికి సంబంధించి ఇప్పటిదాకా చిన్న విషయం కూడా బయటకు రాలేదని, అయితే స్కాం జరిగిన మాట వాస్తవమేనని ఆయన ఆధారాలతో సహా ప్రధానికి తెలియజేశారు. ఈ మేరకు ప్రధానిని కలిసిన విషయాన్ని.. ఆయనకు తానేం చెప్పానన్న వివరాలను కోమటిరెడ్డే స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.