అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
- తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో కీలక పరిణామం
- తొలిరోజే బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్
- హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ ఎమ్మెల్యేలు
దీనిపై బీజేపీ ఎమ్మెల్యేలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా, నేడు కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సస్పెండైన ఎమ్మెల్యేలు రేపు ఉదయం స్పీకర్ ముందుకు వెళ్లాలని ఆదేశించింది. సస్పెన్షన్ పై స్పీకర్ దే తుది నిర్ణయం అని ధర్మాసనం ఉద్ఘాటించింది. ఈ నేపథ్యంలో, స్పీకరే సమస్యను పరిష్కరించే దిశగా నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది.
ఈ సందర్భంగా హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సభలో ప్రజాప్రతినిధులు ఉంటేనే ప్రజాస్వామ్యం నిలబడుతుందని అభిప్రాయపడింది. అసెంబ్లీ వ్యవహారాల్లో న్యాయస్థానాలు కలుగజేసుకోవచ్చని స్పష్టీకరించింది.