మేకపాటి నిర్వర్తించిన మంత్రిత్వ శాఖలు బుగ్గనకు అప్పగింత... గవర్నర్ ఆమోదముద్ర
- మేకపాటి శాఖలు బుగ్గనకు బదలాయింపు
- గవర్నర్ కు ప్రతిపాదనలు పంపిన సర్కారు
- ఆమోదిస్తూ రాజ్ భవన్ ప్రకటన విడుదల
బుగ్గన ఇప్పటివరకు ఆర్థిక మరియు ప్రణాళిక, శాసనసభా వ్యవహారాలు, వాణిజ్య పన్నుల శాఖలను పర్యవేక్షిస్తున్నారు. ఇకమీదట ఆయన అదనంగా పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ, మౌలికవసతులు, పెట్టుబడుల శాఖలను కూడా పర్యవేక్షించనున్నారు. ఈ శాఖలను ఇంతక్రితం మేకపాటి పర్యవేక్షించారు.