కరోనా ప్రభావం తగ్గిపోతోంది.. గత 675 రోజుల్లో అతి తక్కువ కేసుల నమోదు!

India reports 2503 fresh corona cases 4377
  • గత 24 గంటల్లో 2,503 పాజిటివ్ కేసుల నమోదు
  • 27 మంది కరోనా కారణంగా మృతి
  • 36,168కి పడిపోయిన యాక్టివ్ కేసుల సంఖ్య
మన దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో 2,503 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 675 రోజుల్లో ఇంత తక్కువగా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఇదే సమయంలో 4,377 మంది కరోనా నుంచి కోలుకోగా... 27 మంది మృతి చెందారు. రోజువారీ పాజిటివిటీ రేటు 0.47 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 4.29 కోట్ల మందికి కరోనా సోకింది. వీరిలో 4.24 కోట్ల మంది రికవర్ అయ్యారు. ఇప్పటి వరకు 5,15,877 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ఇప్పటి వరకు 1,79,91,57,486 డోసుల వ్యాక్సిన్ వేశారు. ప్రస్తుతం దేశంలో 36,168 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Go Back to Shorts
India
Corona Virus
Update

More Telugu News