ఆఫ్రికాలోని కాంగోలో ఘోర రైలు ప్రమాదం.. 61 మంది దుర్మరణం

Dozens dead in DR Congo train accident
  • పట్టాలు తప్పిన రైలు
  • పక్కనే ఉన్న లోయలో పడిన ఏడు బోగీలు
  • మృతుల్లో మహిళలు, చిన్నారులు
ఆఫ్రికా దేశమైన డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగోలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 61 మంది ప్రాణాలు కోల్పోగా మరో 52 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాంగో ఆగ్నేయ ప్రాంతంలో కొల్వేజి నగరానికి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలోని బయోఫ్వే వద్ద రైలు పట్టాలు తప్పడంతో ఏడు బోగీలు పక్కనే ఉన్న లోయలో పడిపోయాయి. 

మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నట్టు అధికారులు తెలిపారు. చాలా వరకు మృతదేహాలు ఇంకా బోగీల్లోనే చిక్కుకుపోయాయి. మొత్తం 15 వేగన్లు ఉన్న ఇది సరుకు రవాణా రైలు అని, ఖాళీగా ఉన్న 12 బోగీల్లో వందలాది మంది ప్రయాణికులు ఎక్కారని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
Go Back to Shorts
DR Congo
Train Accident
Africa

More Telugu News