ఈ ఫొటోలో ఉన్న సినీ ప్రముఖుడు ఎవరో గుర్తుపట్టగలరా...?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఈ ఫొటోలో ఉన్న సినీ ప్రముఖుడు ఎవరో గుర్తుపట్టగలరా...?

Tollywood senior writer actor Paruchuri Venkateswararao shocking looks
  • ఇటీవల సినిమాల్లో కనిపించని పరుచూరి
  • పరుచూరి నివాసానికి వెళ్లిన దర్శకుడు జయంత్ సి పరాన్జీ
  • వృద్ధాప్యంతో చిక్కిపోయిన స్థితిలో పరుచూరి
  • విచారం వ్యక్తం చేస్తున్న అభిమానులు
తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ రచయితల్లో పరుచూరి వెంకటేశ్వరరావు ఒకరు. ఆయన తన సోదరుడు పరుచూరి గోపాలకృష్ణతో కలిసి వందల చిత్రాలకు పదునైన సంభాషణలు, కథలు అందించారు. వీరు పరుచూరి బ్రదర్స్ గా తమకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. కాగా, పరుచూరి వెంకటేశ్వరరావు కొన్నాళ్ల కిందటివరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ నటించి మెప్పించారు. అయితే, గత కొంతకాలంగా ఆయన తెరపై కనిపించడంలేదు. 

దర్శకుడు జయంత్ సి పరాన్జీ ఇటీవల పరుచూరి నివాసానికి వెళ్లారు. వృద్ధాప్యంతో ఉన్న పరుచూరిని చూసి విచారం వ్యక్తం చేశారు. శరీరం చిక్కి శల్యమైనప్పటికీ ఆయన ఆలోచనల్లో ఇంకా పదును తగ్గకపోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ముడతలు పడిన దేహంతో ఉన్న పరుచూరి ఫొటోను జయంత్ సి పరాన్జీ ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నారు. ఆ ఫొటోను చూసి అభిమానులు అయ్యో... పరుచూరి ఇలా అయిపోయారేంటి? అని బాధపడుతున్నారు. 
.
Paruchuri Venkateswararao
Jayant C Paranji
Writer
Actor

More Telugu News