విశాఖ రుషికొండ బీచ్ లో విషాదం... ఇద్దరు విద్యార్థుల మృతి

  • బీచ్ లో స్నానానికి దిగిన ఆరుగురు విద్యార్థులు
  • అలల తాకిడికి నీట మునిగిన విద్యార్థులు
  • ఒకరి మృతదేహం స్వాధీనం
  • మరొకరి కోసం గాలింపు
విశాఖ రుషికొండ బీచ్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. రుషికొండ బీచ్ లో ఆరుగురు విద్యార్థులు స్నానానికి దిగారు. అయితే, సముద్రంలో మునిగి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. ఒకరి మృతదేహం లభ్యం కాగా, మరో విద్యార్థి కోసం గాలింపు జరుపుతున్నారు. మరో విద్యార్థి అస్వస్థతకు గురికాగా, నగరంలోని గీతం ఆసుపత్రికి తరలించారు. కాగా, మృతులను పరదేశిపాలెం శ్రీరామ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు మొయ్య పార్థు (15), సత్యాల రాజేశ్ (16)గా గుర్తించారు.

Students
Death
Rushikonda Beach
Visakhapatnam

More Telugu News