టాలీవుడ్ డ్రగ్స్ కేసును లోతుగా తవ్వుతున్న ఈడీ.. ఎక్సైజ్ కమిషనర్ కు నోటీసు
- అన్ని రకాల ఆధారాలు ఈడీకి ఇవ్వాలన్న కోర్టు
- ఇప్పటి వరకు సమాచారం ఇవ్వని ఎక్సైజ్ విభాగం
- దీంతో కోర్టు ధిక్కార నోటీసు జారీ చేసిన ఈడీ
అన్ని ఆధారాలను 30 రోజుల్లో అందించాలని కోర్టు నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ ఇంత వరకు వివరాలతో తమ మందుకు రాలేదని ఈడీ కార్యాలయం తెలిపింది. ‘‘కేవలం 12 ఎఫ్ఐఆర్, చార్జ్ షీట్ల కాపీలు ఇప్పటి వరకు ఈడీ డైరెక్టరేట్ కు అందించారు. దర్యాప్తులో భాగంగా సేకరించిన డిజిటల్ సమాచార కాపీలు అందించలేదు’’ అని ఈడీ తరఫు న్యాయవాది నోటీసులో పేర్కొన్నారు. డ్రగ్స్ కేసులో టాలీవుడ్ కు చెందిన అగ్ర నటులు, దర్శకుల కాల్ రికార్డులు సైతం సమర్పించాలని ఈడీ కోరింది.